Trending:
Live 24/7
Home News టీమిండియాకు గుడ్‌న్యూస్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా సిద్ధం
India

టీమిండియాకు గుడ్‌న్యూస్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా సిద్ధం

IMG

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఓ గుడ్‌న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ పరీక్షల్లో బుమ్రా పాసైనట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెల్లడించింది. దీంతో ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు. ఈ సిరీస్‌ కోసం భారత సెలక్షన్ కమిటీ ఇటీవల జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. బుమ్రా, సాయి సుదర్శన్‌లకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్ వస్తేనే మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని అందులో పేర్కొంది. తాజా పరిణామంతో బుమ్రా ఆడటంపై క్లారిటీ వచ్చినట్లే.

/urls/202607319754




Leave a Comment

Your email address will not be published. Required fields are marked *