TGSRTC రిక్రూట్‌మెంట్‌లో కీలక అప్‌డేట్.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల
ఇంటర్నెట్ డెస్క్: TSRTC డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నియామకానికి సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి (TGPRB) విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు కేటగిరీ వారీగా కట్‌ఆఫ్ మార్కులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గత ఏడాది సెప్టెంబర్ 17న మొత్తం 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, నియామక ప్రక్రియ అనంతరం 1,604 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు మండలి ప్రకటించింది. పోస్టుల వారీగా ఎంపికలు డ్రైవర్ పోస్టులు: 1,000 ఎంపికైన అభ్యర్థులు: 894 మంది శ్రామిక్ పోస్టులు: 743 ఎంపికైన అభ్యర్థులు: 710 మంది డ్రైవర్ పోస్టులకు హాజరైన అభ్యర్థులు తమ డ్రైవింగ్ టెస్ట్ మార్కుల వివరాలను వ్యక్తిగత లాగిన్‌లో చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఎంపిక జాబితాలతో పాటు అన్ని కేటగిరీలకు సంబంధించిన కట్‌ఆఫ్ మార్కులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు. దీంతో అభ్యర్థులు తమ ఫలితాలను, కట్‌ఆఫ్ వివరాలను సులభంగా పరిశీలించుకోవచ్చు. ప్రవర్తన పరిశీలనతో పాటు వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే తుది నియామకం ఖరారవుతుంది. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 7 ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 11 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో డిజిటల్ అటెస్టేషన్ ఫారాన్ని పూర్తి చేయాలి. అనంతరం ఆగస్టు 17న అటెస్టేషన్ ఫారం మూడు ప్రతులతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ జిల్లా లేదా కమిషనరేట్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నిర్ణీత గడువుల్లో అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని తెలంగాణ పోలీసు నియామక మండలి సూచించింది.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked *