Trending:
Live 24/7
Home News ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం
Telangana

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం

IMG

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఈరోజు(ఆదివారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఇంజినీర్లను ‘క్రిమినల్ వేస్ట్’ అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కామెంట్స్‌పై ఈ లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. ఒకవైపు భారతదేశ ఇంజినీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే.. అలాంటి వారిని ‘క్రిమినల్ వేస్ట్’ అని రేవంత్‌రెడ్డి అనడం తగదని అన్నారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని అందిస్తున్న ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. సీఎం చేసిన కామెంట్స్‌పైన స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని చెప్పుకొచ్చారు.

/urls/202608028610




Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Popular Post

Tags